Fri Dec 20 2024 06:56:29 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బూర బీజేపీలో చేరిక
మాజీ పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ నేడు బీజేపీలో చేరనున్నారు.
మాజీ పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ నేడు బీజేపీలో చేరనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు బీజేపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఆయన అధికారికంగా చేరనున్నారు. కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. బూర నర్సయ్య గౌడ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో పాటు పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.
మరికొందరు నేతలు...
బూర నర్సయ్య గౌడ్ తో పాటు మరికొందరు నేతలు కూడా పార్టీలో చేరతారని చెబుతున్నారు. బూర నర్సయ్య గౌడ్ చేరికతో మునుగోడు ఉప ఎన్నికలో లబ్ది పొందే అవకాశముందని బీజేపీ భావిస్తుంది. కేసీఆర్ ను కలిసేందుకు తాను ఎన్నిసార్లు ప్రయత్నించినా సమయం ఇవ్వలేదని, ప్రజా సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడంతోనే తాను పార్టీని వీడానని ఆయన చెబుతున్నారు. కేసీఆర్ కు ఘాటు లేఖ కూడా రాశారు.
Next Story