Mon Dec 23 2024 04:50:00 GMT+0000 (Coordinated Universal Time)
అదంతా ఓ డ్రామా.. డీకే అరుణ
మంత్రి శ్రీనివాసగౌడ్ పై హత్యాప్రయత్నం అంతా ఒక డ్రామా అని మాజీ మంత్రి డీకే అరుణ అభిప్రాయపడ్డారు.
మంత్రి శ్రీనివాసగౌడ్ పై హత్యాప్రయత్నం అంతా ఒక డ్రామా అని మాజీ మంత్రి డీకే అరుణ అభిప్రాయపడ్డారు. ఈ కేసులో ఎవరు దోషులో తేలాలన్నారు. తెలంగాణ పోలీసులపై తమకు నమ్మకం లేదని ఆమె చెప్పారు. రాజకీయంగా కుట్ర చేయడానికే ఈ అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. ఈ కేసుల వెనక కేసీఆర్, శ్రీనివాస్ గౌడ్ ల కుట్ర ఉందని చెప్పారు.
సీబీఐ తో....
మంచి పోలీసు అధికారిగా పేరున్న స్టీఫెన్ రవీంద్ర ను కూడా ఈ ప్రభుత్వం లొంగదీసుకుందని డీకే అరుణ ఆరోపించారు. బీహారీ అధికారులతో తెలంగాణలో కేసీఆర్ అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ కేసును సీబీఐ లాంటి స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు చేయించాలని కోరారు. అవసరమైతే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆమె పేర్కొన్నారు.
Next Story