Mon Dec 23 2024 03:12:59 GMT+0000 (Coordinated Universal Time)
తీహార్ జైలులో కవితతో భేటీ అయిన హరీశ్ రావు
తీహర్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మాజీ మంత్రి హరీశ్ రావు భేటీ అయ్యారు
తీహర్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మాజీ మంత్రి హరీశ్ రావు భేటీ అయ్యారు. ఆమెతో కాసేపు ముచ్చటించారు. యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ ఏడాది మార్చి నెల 15వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
జైలులో అందుతున్న...
అప్పటి నుంచి కల్వకుంట్ల కవిత తీహార్ జైలులోనే ఉంటున్నారు. ఆమె అనేకసార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో తీహర్ జైలులో వందరోజుల నుంచి కవిత ఉన్నారు. ఆమెను బీఆర్ఎస్ నేతలు వెళ్లి పరామర్శిస్తున్నారు. ఈరోజు మాజీ మంత్రి హరీశ్ రావు వెళ్లి కల్వకుంట్ల కవితను కలసి ఆమెకు జైలులో అందుతున్న సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు.
Next Story