Tue Dec 17 2024 04:28:17 GMT+0000 (Coordinated Universal Time)
BRS : మమ్మల్ని తిట్టండి.. కానీ రైతులను ఆదుకోండి
ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి రైతు దీక్షలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు
ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి రైతు దీక్షలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ రైతు దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు చనిపోయారన్నారు. వారి కుటుంబాలను ఏ మంత్రి కూడా పరామర్శించడం లేదని, ఎండిన పంటపొలాలను చూడడానికి రావడం లేదని అన్నారు. కనీసం పొలాలకు నీళ్లు ఇచ్చుకుందామనుకున్నా కరెంటు లేదని అన్నారు. ఇటు నీళ్లు లేక చివరకు కన్నీళ్లే మిగిలాయని ఆన అన్నారు.
పరిహారం కింద...
పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల పరిహారం చెల్లించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు 20 లక్షలు పరిహారం చెల్లించాలన్నారు. కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు, చిల్లర మాటలు మాని, రైతులను కాపాడాలన్న హరీశ్ రావు, తమను తిట్టండి కానీ రైతులను ఆదుకోండని కోరారు. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. రెండు లక్షల రైతు రుణమాఫీ, రైతుబంధు 15 వేలు, వడ్లకు మక్కలకు 500 బోనస్, రైతు కూలీలకు 12 వేలు, కౌలు రైతుల 15 వేలు ఇస్తామని చెప్పిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు.
Next Story