Sat Dec 21 2024 14:45:14 GMT+0000 (Coordinated Universal Time)
BRS : అదే జరిగితే రేవంత్ కు సన్మానం చేస్తా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ ను తాను స్వీకరిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ ను తాను స్వీకరిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆగస్టు 15వ తేదీలోగా ఆరు గ్యారంటీలను, రెండు లక్షల రైతు రుణాన్ని మాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. సిద్ధిపేటలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బాండ్ పేపర్ బౌన్స్ అయిందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా? అని హారీశ్ రావు ఛాలెంజ్ చేశారు.
రాజీనామా లేఖలను...
ఇద్దరం రాజీనామా లేఖలను ప్రెస్ అకాడమీ ఛైర్మన్ వద్ద ఉంచుదామని హరీశ్రావు అన్నారు. రేవంత్ రెడ్డి రాజీనామా ఇచ్చిన పది నిమిషాల్లోనే తాను తన రాజీనామా లేఖను పంపిస్తానని చెప్పారు. స్పీకర్ ఫార్మాట్ లోనే తన రాజీనామా లేఖను పంపుతానని చెప్పారు. ఆగస్టు పదిహేనోతేదీలోగా ఆరు గ్యారంటీలను, రైతు రుణమాఫీ చేస్తే తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్మానం చేసే దానికి కూడా వెనుకాడనని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేసిందన్నారు.
Next Story