Mon Dec 23 2024 09:01:05 GMT+0000 (Coordinated Universal Time)
BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకుంటున్నారు
ీబీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకునేందుకు అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకునేందుకు అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇదే పనిలో ఉన్నారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వద్దకు ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లడం వారిని భయపెట్టి తమ దారికి తెచ్చుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉందని అన్నారు.
మ్యానిఫేస్టోలో చెప్పేదేమిటి?
అభివృద్ధి, ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకే ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్ మ్యానిఫేస్టోలో చెప్పిందేమిటి? వీళ్లు చేస్తుందేమిటి? అన్ని హరీశ్ రావు ప్రశ్నించారు. మ్యానిఫేస్టోలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మాత్రం దానిని తుంగలోకి తొక్కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ గా చేసుకుందని హరీశ్ రావు అన్నారు.
Next Story