Mon Dec 23 2024 08:08:41 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ గాంధీ ప్రాపకం కోసమే రేవంత్ పాట్లు
రైతు రుణమాఫీ, రైతుబంధు ఎప్పుడు చేస్తారో చెప్పాలని మాజీమంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు
రైతు రుణమాఫీ, రైతుబంధు ఎప్పుడు చేస్తారో చెప్పాలని మాజీమంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ సక్రమంగా అమలు చేయలేదని, రైతు బంధు ఇంతవరకూ అమలు చేయలేదని కేటీఆర్ అన్నారు. రాహుల్ వద్ద మార్కులు కొట్టేయడానికే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు పెడుతున్నారని కేటీఆర్ అన్నారు.
రాజీవ్ గాంధీ పేరును...
అదానీ విషయంలో రాహుల్‌కు, రేవంత్‌కు విభేదాలున్నాయన్న కేటీఆర్ అదానీపై జేపీసీ వేయాలని తాము కోరుతున్నామని తెలిపారు. తెలంగాణకు రాజీవ్‌గాంధీ చేసింది ఏమిటో చెప్పాలన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టు పేరు కచ్చితంగా మారుస్తామని కేటీఆర్ తెలిపారు. రాజీవ్‌గాంధీ ఒక్కటే కాదు..మిగతా అన్నింటి పేర్లను కూడా పరిశీలిస్తామని తెలిపారు.
Next Story