Mon Dec 23 2024 05:29:11 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబును కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మాజీ మంత్రి మల్లారెడ్డి కలిశారు. ఆయనతో పాటు తీగల కృష్ణారెడ్డి కూడా కలిశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మాజీ మంత్రి మల్లారెడ్డి కలిశారు. ఆయనతో పాటు తీగల కృష్ణారెడ్డి కూడా కలిశారు. హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు నాయుడిని కలిసి కాసేపు చర్చించారు. అయితే మల్లారెడ్డి మాత్రం తాను పెండ్లి పత్రిక ఇవ్వడానికే వచ్చానని మీడియాకు తెలిపారు. కానీ తీగల కృష్ణారెడ్డి మాత్రం తాను టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేందుకే కలిశామని తీగల కృష్ణారెడ్డి తెలిపారు.
పార్టీ బలోపేతం కోసమే...
గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని తెలిపారు. అయితే చంద్రబాబు నాయుడు మళ్లీ మరోసారి మాట్లాడతానని చంద్రబాబు చెప్పారని తీగల కృష్ణారెడ్డి తెలిపారు. మల్లారెడ్డి మాత్రం తాను పెళ్లి పత్రిక ఇవ్వడానికే వచ్చానని తెలిపారు. మొత్తం మీద ఇద్దరు నేతలు కలవడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Next Story