Mon Dec 23 2024 01:53:57 GMT+0000 (Coordinated Universal Time)
Congress : తెలంగాణకు పాకిన...ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు.. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కోసం?
పార్టీ కార్యాలయం నిర్మాణానికి బీఆర్ఎస్ కు పదకొండు ఎకరాలు ఎందుకని మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ ప్రశ్నించారు
ఆంధ్రప్రదేశ్ లో వైసీీపీ భవనాలను కూల్చివేస్తున్న ఘటనలు తెలంగాణలోనూ వ్యాపించాయి. అయితే ఇక్కడ భవనాలను కూల్చివేయడం కాదు. కేటాయించిన భూములు వెనక్కు తీసుకోవాలన్న డిమాండ్ వినపడుతుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కోకాపేటలో అతి ఖరీదైన భూమిని పార్టీ కార్యాలయం కోసం కేటాయించింది. ఇప్పుడు దానిని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తుంది.
వెనక్కు తీసుకోవాలంటూ...
పార్టీ కార్యాలయం నిర్మాణానికి బీఆర్ఎస్ కు పదకొండు ఎకరాలు ఎందుకని మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ పర్శ్నించారు. కోకాపేట్ లో బీఆర్ఎస్ కోసం కేటాయించిన భూమిని వెనక్కు తీసుకోవాలని కోరారు. ఆ పదకొండు ఎకరాలను వేలం వేసి రైతు రుణమాఫీకి వినియోగించాలని షబ్బీర్ ఆలీ కోరారు. బీఆర్ఎస్ కు ఇప్పుడున్న ఆఫీస్ ఎక్కువని, ఆ స్థలాన్ని కూడా తమ ప్రభుత్వ హయాంలోనే ఇచ్చిన సంగతిని షబ్బీర్ ఆలీ గుర్తు చేశారు.
Next Story