Mon Dec 23 2024 06:13:08 GMT+0000 (Coordinated Universal Time)
BRS : బీఆర్ఎస్కు షాక్ ఇచ్చి కాంగ్రెస్ లో చేరిక
మాజీ మంత్రి తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపనున్నా
మాజీ మంత్రి తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపనున్నారు. వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని భావించిన రాజయ్య బీఆర్ఎస్ టిక్కెట్ అడిగినా స్పందించకపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేయనున్నారు. గత ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ నుంచి రాజయ్యకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టిక్కెట్ నిరాకరించి, కడియం శ్రీహరికి ఇచ్చిన సంగతి తెలిసిందే.
వరంగల్ ఎంపీ సీటు కూడా...
వరంగల్ ఎంపీ సీటు కూడా కడియం శ్రీహరి కుమార్తెకు ఇస్తామని తెలియడంతో ఆయన రాజీనామా చేయనున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని సమాచారం. రెండు రోజుల క్రితం తాటికొండ రాజయ్య మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారు. తాను వరంగల్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.
Next Story