Mon Dec 23 2024 05:37:37 GMT+0000 (Coordinated Universal Time)
ఓపిక పడదాం.. మంచిరోజులొస్తాయ్
రాజకీయాల్లో ఓపిక అవసరమని, త్వరలోనే మంచి రోజులు వస్తాయని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు
రాజకీయాల్లో ఓపిక అవసరమని, త్వరలోనే మంచి రోజులు వస్తాయని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తాను పదవుల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీల మీద కూడా కక్ష సాధింపు చర్యలకు దిగలేదన్నారు. కానీ నేడు మన పార్టీ వారే మన మీదే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. ఏదైనా సమయం వస్తుందని, అప్పటి వరకూ ఓపికతో వేచి చూడటమే మంచిదని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
చిల్లర వ్యక్తులను....
పాలేరు నియోజకవర్గం కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. ఓపిక పడితే కార్యకర్తలు కూడా రాజులవుతారని తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. తాను మంత్రిగా జిల్లా అంతటా అనేక అభివృద్ధి పనులు చేశానని, ఆ తృప్తి తనకు చాలునని అన్నారు. కొందరు చిల్లర వ్యక్తులు చేసే చిల్లర పనులకు స్పందించవద్దన్నారు. మనం పార్టీలోనే ఉన్నందున ఎక్కడా తొందరపాటు తనం పనికిరాదని తెలిపారు.
Next Story