Mon Dec 23 2024 09:59:18 GMT+0000 (Coordinated Universal Time)
పొంగులేటికి ఝలక్ ఇచ్చిన టీఆర్ఎస్
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె వెడ్డింగ్ రిసెప్షన్ కు బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ హాజరయ్యారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె వెడ్డింగ్ రిసెప్షన్ పై రాజకీయ చర్చ జరుగుతుంది. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఈ రిసెప్షన్ కు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. ఖమ్మంలో అట్టహాసంగా జరిగిన ఈ వివాహ రిసెప్షన్ కు టీఆర్ఎస్ అగ్రనేతలందరూ దూరంగా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఖమ్మం జిల్లా నేతలతో పాటు క్యాడర్ కూడా ఈ వివాహ రిసెప్షన్ కు హాజరు కాలేదు. బీజేపీ నేతలు మాత్రం రావడం విశేషం.
బీజేపీ నేతలు మాత్రం...
టీఆర్ఎస్ లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక నేతగా ఉన్నారు. అయితే ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కు తెలంగాణ మంత్రులు కూడా దూరంగా ఉన్నారు. గత కొద్దికాలంగా పొంగులేటి బీజేపీ లో చేరతారన్న ప్రచారం జరుగుతుంది. ఇటీవల మంత్రి కేటీఆర్ కూడా ఖమ్మం వచ్చిన సందర్భంలో పొంగులేటి నివాసానికి వెళ్లారు. కేటీఆర్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన కోటి రూపాయలు వెచ్చించి వరద బాధితులకు సాయం కూడా అందించారు. కానీ పొంగులేటి కుమార్తె వివాహ రిసెప్షన్ కు మాత్రం టీఆర్ఎస్ నేతలు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
Next Story