Sun Apr 13 2025 08:26:22 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు బెయిల్ మంజూరు
మాజీ పార్లమెంటు సభ్యులు కొత్తపల్లి గీత దంపతులకు బెయిల్ లభించింది. హైకోర్టుకీ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

మాజీ పార్లమెంటు సభ్యులు కొత్తపల్లి గీత దంపతులకు బెయిల్ లభించింది. హైకోర్టు ఇద్దరికీ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇరవై ఐదు వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తును సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు ను మోసం చేసిన కేసులో కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానాను సీబీఐ కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
మధ్యంతర ఉత్తర్వులు....
దీనిపై కొత్తపల్లి గీత దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కోర్టు ను సవాల్ చేస్తూ వారు వేసుకున్న పిటీషన్ ను హైకోర్టు విచారించింది. సీబీఐ కోర్టును నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై తదుపరి విచారణను డిసెంబరు 16వ తేదీకి వాయిదా వేసింది.
Next Story