Mon Dec 23 2024 20:06:54 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కేసీఆర్కు హైకోర్టులో నిరాశ
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు హైకోర్టులో నిరాశ ఎదురయింది.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు హైకోర్టులో నిరాశ ఎదురయింది. కేసీఆర్ విద్యుత్తు కమిషన్ పై వేసిన పిటీషన్ పై హైకోర్టు కొట్టివేసింది. జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారంటూ కేసీఆర్ పిటీషన్ వేశారు. ఈ కమిషన్ విచారణను నిలుపుదల చేయాలంటూ కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. నరసింహారెడ్డి విచారణ చేపట్టకముందే మీడియా సమావేశం పెట్టి వివరాలను వెల్లడించడాన్ని కేసీఆర్ తరుపున న్యాయవాదులు తెలిపారు.
ఏజీ వాదనలతో...
అయితే అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ మేరకే కమిషన్ ను ఏర్పాటు చేశామని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ విద్యుత్తు కొనుగోళ్లపై విచారణ జరుపుతుందని పేర్కొన్నారు. ఏజీ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఆయన పిటీషన్ ను కొట్టివేసింది. విద్యుత్తు కొనుగోళ్లలో అవకతవకాలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ను ఏర్పాటు చేసినసంగతి తెలిసిందే.
Next Story