Sun Dec 22 2024 22:29:59 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్ కానున్నారు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్ కానున్నారు. గత పది రోజులకు పైగానే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ను ఈరోజు డిశ్చార్జ్ చేయనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కేసీఆర్ హైదరాబాద్ లోని నందినగర్ లోని తన పాత నివాసానికి వెళ్లనున్నారు.
నందినగర్ లోని...
కేసీఆర్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎర్రవెల్లిలోని తన ఫాం హౌస్ కు వెళ్లారు. అక్కడ ఆయన పంచె తగిలి కాలు జారిపడటంతో తుంటి ఎముక ఫ్రాక్చర్ అయింది. దీంతో యశోదా ఆసుపత్రి వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. వేగంగా కేసీఆర్ కోలుకోవడంతో నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
Next Story