Mon Dec 23 2024 16:08:15 GMT+0000 (Coordinated Universal Time)
నా కుమార్తెకు ఆ పబ్ కు సంబంధం లేదు
పుడింగ్ అండ్ మింక్ పబ్ తో తన కుమార్తెకు సంబంధం లేదని మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి చెప్పారు
పుడింగ్ అండ్ మింక్ పబ్ తో తన కుమార్తెకు సంబంధం లేదని మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి చెప్పారు. తన కూతురిని పోలీసులు ప్రశ్నించారన్నది కూడా వాస్తవం కాదని రేణుక తెలిపారు. ఫుడ్ అండ్ మింక్ పబ్ పై పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పబ్ కు తన కుమార్తె తేజస్వినికి సంబంధం లేదని రేణుక చౌదరి తెలిపారు.
పోలీసులు ప్రశ్నించలేదు....
పబ్ కు ఓనర్ తన కూతురు కాదన్న రేణుక చౌదరి, తన కుమార్తెను పోలీసులు ప్రశ్నించలేదని కూడా చెప్పారు. ఉదయం నుంచి మీడియాలో వస్తున్న కథనాలను ఆమె ఖండించారు. ప్రచురించే ముందు మీడియా ఒక సారి క్రాస్ చెక్ చేసుకుంటే మంచిదని రేణుక చౌదరి హితవు పలికారు.
Next Story