Wed Apr 16 2025 21:06:06 GMT+0000 (Coordinated Universal Time)
కుంభమేళాలో తెలుగు మహిళల మిస్సింగ్
ప్రయాగరాజ్ లో్ జరుగుతున్న కుంభమేళాలో తెలంగాణకు చెందిన నలుగురు మహిళలు కనిపించకుండా పోయారు

ప్రయాగరాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో తెలంగాణకు చెందిన నలుగురు మహిళలు కనిపించకుండా పోయారు. ఇటీవల కుంభమేళాకు వెళ్లిన నలుగురు మహిళలు తప్పి పోయారు. వారి వయసు యాభై ఐదేళ్లు పై బడిన వారే. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రయాగరాజ్ లోని కుంభమేళాకు ఈ నెల 29న చేరుకున్నారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆందోళనలో కుటుంబ సభ్యులు
అప్పటి నుంచి వారి జాడ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తప్పిపోయిన వారిలో విద్యానగర్ కు చెందిన నరసవ్వ, కొత్త వాడకు చెందిన రాజవ్వ, మరో ఇద్దరు కుటుంబ సభ్యులు నిర్మల్ జిల్లా కడెంకు చెందినవారుగా చెబుతున్నారు. కడెంకు చెందిన బుచ్చవ్వ , సత్తవ్వ కూడా తప్పిపోయినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఒకేసారి పదకొండు మంది కుంభమేళాకు వెళ్లినా అందులో ఐదుగురు కనిపించకుండా పోయారని ఇక్కడి బంధువులకు సమాచారం ఇచ్చారు.
Next Story