Mon Dec 23 2024 02:51:30 GMT+0000 (Coordinated Universal Time)
Mega DSC Notification:వచ్చేసిన మెగా డీఎస్సీ.. మొత్తం ఎన్ని పోస్టులంటే?
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది
Mega DSC Notification:ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ఈమేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 11,062 పోస్టులతో జారీ అయిన ఈ నోటిఫికేషన్ లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629 ఉండగా, ఎస్జీటీ పోస్టులు 6,508 ఖాళీలు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి.
ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ను రేవంత్ రెడ్డి సర్కారు రద్దు చేసింది. సెప్టెంబర్ 6న 5,089 పోస్టులతో బీఆర్ఎస్ ప్రభుత్వం నియామక ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ను రద్దు చేసి, అదనంగా 5 వేల పోస్టులు కలిపి మొత్తం 11,062 పోస్టులతో తెలంగాణ ముఖ్యమంత్రి కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేశారు. అప్పట్లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోనవసరం లేదని సీఎం తెలిపారు.
Next Story