Fri Dec 20 2024 06:32:25 GMT+0000 (Coordinated Universal Time)
పోటీ చేయడానికి సిద్ధమే: గద్దర్ కుమార్తె
కాంగ్రెస్ అవకాశం ఇస్తే కంటోన్మెంట్ నుండి పోటీ చేస్తానని
కాంగ్రెస్ అవకాశం ఇస్తే కంటోన్మెంట్ నుండి పోటీ చేస్తానని గద్దర్ కుమార్తె వెన్నెల తెలిపారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఉద్యమించాలని గద్దర్ అనుకున్నారని.. ప్రజల కోసం కృషి చేశారన్నారు. సమసమాజం కోసం కృషి చేసిన వ్యక్తి గద్దర్ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మొదట్లో కాంగ్రెస్ సీట్ ఇస్తామని అన్నారు.. ఇప్పుడు ఇంకా ఏమి మాట్లాడలేదన్నారు వెన్నెల. ఒకవేళ సీట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ తోనే ఉంటామని తెలిపారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ఇక్కడ ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం వల్లే కదా.. ఆమెకు గద్దర్ గురించి తెలుసన్నారు. మా నాన్న 2014 నుంచి ఓటు వేస్తున్నాడు. చివరి దశలో మా తండ్రి కాంగ్రెస్ తో ఉన్నారని తెలిపారు.
కంటోన్మెంట్ లో పుట్టి పెరిగిన చాలా మంది తనను ఎన్నికల్లో పోటీ చేయమని అడుగుతున్నారని వెన్నెల తెలిపారు. కాంగ్రెస్ అవకాశం ఇస్తే కంటోన్మెంట్ నుండి పోటీ చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ తన పేరును పరిశీలిస్తూ ఉందని అన్నారు. గద్దర్ కూతురుగా మీ ముందుకు వస్తున్నానన్నారు. ఓట్ల విప్లవం రావాలని గద్దర్ అన్నారని.. అందుకే ఆయన కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారని తెలిపారు.
Next Story