Mon Dec 23 2024 10:46:12 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడు ఎన్నికల బరిలో గద్దర్
ప్రజాశాంతి పార్టీ తరుపున అభ్యర్థిగా మునుగోడు ఉప ఎన్నికల్లో గద్దర్ బరిలోకి దిగనున్నారు
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజా గాయకుడు గద్దర్ పోటీ చేయనున్నారు. ఆయన ఈ మేరకు ప్రకటించారు. ప్రజాశాంతి పార్టీ తరుపున అభ్యర్థిగా మునుగోడు ఉప ఎన్నికల్లో గద్దర్ బరిలోకి దిగనున్నారు. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తో చర్చించిన అనంతరం గద్దర్ ఆ పార్టీ కార్యాలయంలో ఈ ప్రకటన చేశారు.
ప్రజాశాంతి పార్టీ నుంచి...
ప్రజా గాయకుడు గద్దర్ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారాన్ని రేపటి నుంచి ప్రారంభిస్తానని గద్దర్ తెలిపారు. ప్రపంచ శాంతి కోసం శ్రమిస్తున్న కేఏ పాల్ తో కలసి పనిచేయాలన్న ఉద్దేశ్యంతోనే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు గద్దర్ తెలిపారు.
Next Story