Mon Dec 23 2024 11:59:30 GMT+0000 (Coordinated Universal Time)
ఎట్ హోం కు కేసీఆర్ దూరం
తెలంగాణలో గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరిగింది. ఎట్ హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు
తెలంగాణలో గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ఎట్ హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు. చివరి నిమిషంలో ఆయన తన రాజ్‌భవన్ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. రాజ్‌భవన్ లో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రతి ఏటా ఎట్ హోం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రులు, హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు ఉన్నతాధికారులు హాజరవ్వడం సంప్రదాయంగా వస్తుంది.
కొనసాగుతున్న గ్యాప్....
అయితే ఆ సంప్రదాయానికి కేసీఆర్ ఈ ఏడాది ఫుల్స్టాప్ పెట్టేశారు. రాజ్‌భవన్ లో ఎట్ హోం కార్యక్రమం ప్రారంభమయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు తెలంగాణకు చెందిన మంత్రులు ఎవరూ హాజరు కాలేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. కొంతకాలంగా గవర్నర్ కు, ముఖ్యమంత్రికి మధ్య గ్యాప్ పెరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారానికి మాత్రం కేసీఆర్ హాజరయ్యారు. కానీ బీజేపీతో విభేదాలు పెరిగిన తర్వాత కేసీఆర్ రాజ్‌భవన్ కు కూడా దూరంగా ఉంటున్నారు.
Next Story