Sun Dec 22 2024 16:02:21 GMT+0000 (Coordinated Universal Time)
ట్రాక్టర్ ను ఢీ కొట్టిన గరుడబస్సు.. ముగ్గురి మృతి
హైదరాబాద్ మియాపూర్ డిపో నుండి బెంగళూరుకు వెళ్తున్న గరుడ బస్సు చెరుకు లోడు ట్రాక్టర్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం..
వనపర్తి జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కొత్తకేట మండలంలోని జాతీయ రహదారిపై ముమ్మాళ్లపల్లి వద్ద చెరుకు లోడుతో వెళ్తోన్న ట్రాక్టర్ ను గరుడ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారమిచ్చారు.
హైదరాబాద్ మియాపూర్ డిపో నుండి బెంగళూరుకు వెళ్తున్న గరుడ బస్సు చెరుకు లోడు ట్రాక్టర్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్, క్లీనర్ సహా ఓ ప్రయాణికుడు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రగాయాలైన వారిని వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Next Story