Mon Dec 23 2024 13:11:51 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నంబరుకు కాల్ చేస్తే.. ఇంటికే బూస్టర్ డోస్
థర్డ్ వేవ్ కారణంగా 60 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ బూస్టర్ డోస్ వేస్తున్నారు. అయితే.. 60 ఏళ్లు పైబడి.. దీర్ఘకాలిక వ్యాధులతో
కరోనా కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ ను అధిగమించాలంటే బూస్టర్ డోస్ తీసుకోవాలని వైద్య నిపుణులు చెప్పిన సంగతి తెలిసిందే. డబ్ల్యూహెచ్ఓ కూడా బూస్టర్ డోస్ ను తీసుకోవాలని తెలపడంతో.. భారత్ లో ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు సీనియర్ సిటిజన్లకు బూస్టర్ డోసులు వేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణలో ప్రస్తుతం రెండు డోసుల వ్యాక్సినేషన్ తో పాటు.. బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేశారు అధికారులు.
Also Read : కీలక నిర్ణయం తీసుకున్న ఇండిగో.. ఇకపై కడప నుంచి..
థర్డ్ వేవ్ కారణంగా 60 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ బూస్టర్ డోస్ వేస్తున్నారు. అయితే.. 60 ఏళ్లు పైబడి.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ.. వ్యాక్సినేషన్ సెంటర్ కు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోలేని వారికోసం జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ హెల్ప్లైన్కు ఫోన్ చేస్తే డైరెక్ట్గా వారి ఇంటికి వచ్చి బూస్టర్ డోసు వేస్తామని ప్రకటించింది. దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందులు పడుతున్న వారు 04021111111 నెంబర్కు ఫోన్ చేసి వివరాలు చెప్తే.. సిబ్బంది ఇంటికే వచ్చి వ్యాక్సిన్ వేస్తారని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
Next Story