Thu Dec 19 2024 15:05:03 GMT+0000 (Coordinated Universal Time)
Yadadri : యాదాద్రిలో గిరిప్రదిక్షిణ ప్రారంభం
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో గిరి ప్రదిక్షిణ ప్రారంభమైంది.
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో గిరి ప్రదిక్షిణ ప్రారంభమైంది. ఈరోజు తెల్లవారు జాము నుంచే భక్తులు గిరిప్రదిక్షణలో పాల్గొన్నారు. గిరి ప్రదిక్షణలో ఎక్కువ మంది భక్తులు పాల్గొన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద గిరిప్రదిక్షిణ నేడు పునఃప్రారంభమైంది. కొండకింద గాలిగోపురం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభయింది.
రెండు కిలోమీటర్లు...
దాదాపు రెండు కిలోమీటర్ల మేర ప్రదిక్షిణగా భక్తులు శ్రీవారి మెట్ల నుంచి కొండపైకి చేరుకుననారు. వారంతా ఉచిత క్యూ లైన్ లోకిప్రవేశించి స్వామి వారిని దర్శించుకున్నారు. తెలంగాణలో గిరిప్రదిక్షిణ ప్రవేశపెట్టిన మొదటి ఆలయంగా యాదాద్రి నిలిచింది. భక్తులు గిరిప్రదిక్షిణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.
Next Story