Mon Dec 23 2024 07:22:20 GMT+0000 (Coordinated Universal Time)
ఘట్ కేసర్ బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతం
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కృష్ణవేణిని సైకో సురేష్ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారి ఆచూకీ కోసం..
ఘట్ కేసర్ లో నాలుగేళ్ల చిన్నారి కృష్ణవేణి కిడ్నాప్ కేసు సుఖాంతమయింది. మేడ్చల్ లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి బుధవారం సాయంత్రం కిడ్నాపైంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కృష్ణవేణిని సైకో సురేష్ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారి ఆచూకీ కోసం రంగంలోకి దిగిన పోలీసు బృందాలు.. గాలింపు చర్యలు చేపట్టాయి. ఎట్టకేలక చిన్నారి ఆచూకీ లభ్యమైంది. గురువారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాలిక ఆచూకీ లభ్యమైంది. కిడ్నాపర్ సురేష్ నుంచి బాలికను పోలీసులు రక్షించి, సురేష్ ను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి క్షేమంగా ఉందని తెలుసుకున్న తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
కృష్ణవేణి (4) కిడ్నాప్ పై కేసు నమోదు చేసుకున్న పాప మిస్సైన ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా.. సురేష్ అనే వ్యక్తి పాపను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. పాపను ఎత్తుకెళ్లిన వ్యక్తి సైకోలా ప్రవర్తిస్తుంటాడని స్థానికులు చెప్పడంతో.. పాపను అతను ఏం చేసి ఉంటాడోనని భయపడ్డారు. తమ పాపను క్షేమంగా తీసుకురండి అంటూ తల్లిదండ్రులు పోలీసులను కన్నీటితో వేడుకుంటున్న తీరు స్థానికులను కలచివేసింది.
Next Story