Mon Dec 23 2024 14:02:54 GMT+0000 (Coordinated Universal Time)
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్
ఎంసెట్ లో ర్యాంకు కేటాయింపుకు ఇంటర్ లో కనీస మార్కులతో పాస్ అయితే చాలని విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా ఈ విద్యాసంవత్సరంలోనూ కొన్ని నెలలపాటు ఆన్ లైన్ క్లాసులు జరిగాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు పలు ఇబ్బందులనూ ఎదుర్కొన్నారు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనప్పటికీ.. చాలా మంది విద్యార్థులు ఇంకా వెనుకబడే ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
ఎంసెట్ లో ర్యాంకు కేటాయింపుకు ఇంటర్ లో కనీస మార్కులతో పాస్ అయితే చాలని విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీఓ విడుదలయింది. పాత నిబంధనల ప్రకారం ఎంసెట్ ర్యాంకు కేటాయించాలంటే.. జనరల్ కేటగిరీ ఇంటర్ విద్యార్థులు 45 శాతం, ఇతరులు 40 శాతం మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. కానీ కరోనా నేపథ్యంలో పాస్ అయితే చాలని ప్రభుత్వం తెలిపింది. ఎంసెట్ కు ఇంటర్ మార్కుల వెయిటేజీతో సంబంధం ఉండదు. కేవలం ఎంసెట్ లో వచ్చిన మార్కులతోనే ర్యాంకును కేటాయిస్తారు.
Next Story