Sun Dec 14 2025 03:49:08 GMT+0000 (Coordinated Universal Time)
రాజాసింగ్ పీడీ యాక్ట్ పై నేడు విచారణ
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరికాసేపట్లో పీడీ యక్ట్ పై అడ్వయిజరీ కమిటీ విచారణకు హాజరు కానన్నారు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరికాసేపట్లో పీడీ యక్ట్ పై అడ్వయిజరీ కమిటీ విచారణకు హాజరు కానన్నారు. జైలు నుంచే రాజాసింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపుతారు. ముగ్గురు రిటైర్డ్ న్యాయమూర్తులతో కూడిన అడ్వయిజరీ బోర్డు రాజాసింగ్ వాదనలను వింటుంది.
విచారణ తర్వాత....
గత నెలలో రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదయింది. ఆయన అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. పీడీ యాక్ట్ ప్రకారం మూడు నెలల నుంచి ఏడాది వరకూ జైలులో ఉండే అవకాశముంది. పోలీసులు, రాజాసింగ్ వాదనలను బోర్డు విని తన నిర్ణయం ప్రకటిస్తుంది. దీనిని బట్టి ఆయనకు బెయిల్ వస్తుందా? రాదా? అన్నది తేలిపోతుంది. ఈ బోర్డు విచారణ తర్వాత హైకోర్టులో రాజాసింగ్ బెయిల్ పిటీషన్ వేసుకునే అవకాశం ఉంది.
Next Story

