Sun Mar 23 2025 15:15:33 GMT+0000 (Coordinated Universal Time)
రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్లు
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో క్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం ర్యాట్ హోల్స్ మైనర్లను రంగంలోకి దించింది

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో క్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం ర్యాట్ హోల్స్ మైనర్లను రంగంలోకి దించింది. నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న ఆరుగురు మైనర్లు టన్నెల్ వద్దకు చేరుకున్నారు. గతంలో పలు ఆపరేషన్ లలో వీరు సక్సెస్ అయ్యారు. అనేక మందిని ర్యాట్ హోల్ మైనర్లు బయటకు తీసుకు వచ్చారు.
ఉత్తరాఖండ్ లో...
2023లో ఉత్తరాఖండ్ సిల్కియారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. దాదాపు పదిహేడు రోజుల పాటు ఎన్.డి.ఆర్.ఎఫ్, సైన్యం ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. దీంతో అధికారులు ర్యాట్ హలో మైనర్లను రంగంలోకి దించారు. చివరికి ఈ ర్యాట్ హోల్ మైనర్లు ఒక్కరోజులోనే వారిని సురక్షితంగా తీసుకొచ్చారు. దీంతో వీరు ఈ టన్నెల్ లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువస్తారని అధికారులు చెబుతున్నారు
Next Story