Fri Dec 20 2024 17:15:32 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఒకేసారి 213 మంది ఖైదీలు విడుదల
తెలంగాణలో 213 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో 213 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జైలు జీవితం నుంచి విముక్తి పొందనున్న వారిలో 205 మంది జీవిత ఖైదు అనుభవిస్తున్న వారు ఉన్నారు. ఒక్కొక్కరు యాభై వేల రూపాయల సొంత పూచీకత్తు సమర్పించాలని ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
మూడు నెలలకొకసారి...
విడుదలైన వారంతా ప్రతి మూడు నెలలకొకసారి జిల్లా ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాలని అందులో ఆదేశించింది. దీంతో చర్లపల్లి జైలు వద్ద విడుదలవుతున్న తమ వారి కోసం వారి బంధువులు, కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. విడుదలయిన ఖైదీలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ వృత్తుల్లో ఉన్న వారికి ఉపాధి అవకాశాలను కల్పించనుంది.
Next Story