Mon Dec 23 2024 09:40:50 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : వాహనదారులకు శుభవార్త... పెండింగ్ చలాన్లపై రాయితీ గడువు పొడిగింపు
తెలంగాణలో పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు రాయితీ పొందడానికి ప్రభుత్వం గడువు పెంచింది
తెలంగాణలో పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు రాయితీ పొందడానికి ప్రభుత్వం గడువు పెంచింది. ఈ నెల 31 వతేదీ వరకూ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 3.09 కోట్ల దాకా పెండింగ్ చలాన్లు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. పెండింగ్ చలాన్ల ద్వారా 107 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కోటి ఏడు లక్షల మంది మాత్రమే పెండింగ్ చలాన్లను క్లియర్ చేశారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
రాయితీ మొత్తం...
ఈరోజుతో పెండింగ్ చలాన్ల గడువు పూర్తయింది. దీంతో రాయితీ గడువును ఈ నెల 31వ తేదీ వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో వాహనదారులకు మరో ఛాన్స్ ఇచ్చినట్లయింది. ద్విచక్రవాహనాలకు, ఆటోలకు ఎనభై శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు అరవై శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. గత నెల 26వ తేదీన ప్రారంభమైన ఈ చలాన్లకు మంచి స్పందనే లభించింది. దీంతో మరోసారి గడును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
Next Story