Mon Dec 23 2024 00:55:57 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో టెన్త్ స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. యాభై శాతం ఛాయిస్ ఉంటుంది
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. యాభై శాతం ఛాయిస్ ఉంటుందని పేర్కొంది. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మే 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఎప్పటిలాగా ఈసారి 11 పేపర్లుండవు. కేవలం ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయి. అన్ని పేపర్లలో ప్రశ్నాపత్రంలో ఉన్న యాభై శాతం వాటికి మాత్రమే జవాబు ఇవ్వాల్సి ఉంటుంది.
యాభై శాతం ఛాయిస్...
అయితే ఆబ్జెక్టివ్ పార్ట్ లో అన్ని ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. థియరీ ప్రశ్నాపత్రాల్లో మాత్రమే యాభై శాతం ఛాయిస్ ఉంటుంది. ఈ సంవత్సరం టెన్త్ విద్యార్థులకు మరో వెసులుబాటు కూడా కల్పించారు. మొత్తం సిలబస్ లో 70 శాతం నుంచే ప్రశ్నాపత్రాలు ఇస్తారు. కరోనా కారణంగా సిలబస్ పూర్తి కాకపోవడంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులు టెన్షన్ పడకుండా ఛాయిస్ ను యాభై శాతం ఇవ్వడం విశేషం.
Next Story