Fri Mar 28 2025 08:15:13 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీఫ్ సీజన్ లో సన్నరకం వడ్ల కొనుగోలుపై బోనస్ కు సంబంధించిన నిధులను విడుదల చేసింది.

తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీఫ్ సీజన్ లో సన్నరకం వడ్ల కొనుగోలుపై బోనస్ కు సంబంధించిన నిధులను విడుదల చేసింది. ఈ మేరకు ఈ సీజన్ లో సన్న వడ్ల కొనుగోలు చేయడానికి అదనంగా బోనస్ చెల్లించడానికి పన్నెండు వందల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
సన్నరకం వడ్లకు...
తెలంగాణలో సన్నరకం వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ను ఇస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. గతంలోనూ ఈ ప్రకారం చెల్లించింది. రానున్న సీజన్ లోనూ ఇదేరకమైన బోనస్ చెల్లించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయడంలో భాగంగా నిధులను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. రైతులకు ఇది ఎంతో ఉపయోగకరమని పార్టీ నేతలుచెబుతున్నారు
Next Story