Mon Nov 18 2024 08:47:22 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్
తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపటి నుెంచి రైతుబంధు పెట్టుబడి సాయం అందించనున్నారు
తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపటి నుెంచి రైతుబంధు పెట్టుబడి సాయం అందించనున్నారు. రేపు ఉదయం నుంచి రైతుల బ్యాంకు ఖాతాలలో రైతుబంధు మొత్తం జమ అవుతుంది. యాసింగి సీజన్ కు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయాన్ని తక్షణం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సీజన్ లో దాదాపు 66 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందనుంది.
రైతుబంధు సాయం కింద...
దాదాపు 7,600 కోట్ల రూపాయలను ప్రభుత్వం సిద్ధం చేసింది. రైతు బంధు నిధులను సకాలంలో అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం రేపటి నుంచి రైతు బంధు పథకం కింద నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. అర్హులైన ప్రతి ఒక్క రైతుకు సాయం అందిలా చూడాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గత వానాకాలం సీజన్ లో రైతు బంధు సాయం కింద 50 వేల కోట్లకు చేరుకుంది. ఈ సీజన్ తో అది 65 వేల కోట్లకు చేరుతుందని అధికారులు తెలిపారు.
Next Story