Mon Dec 23 2024 10:13:59 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణవాసులకు గుడ్ న్యూస్ .. నేటి నుంచి కొత్త పాలసీ
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి కొత్త ఈవీ పాలసీని అమలులోకి తేనుంది
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి కొత్త ఈవీ పాలసీని అమలులోకి తేనుంది. కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేవారికి నిజంగా ఇది తీపి కబురే. రాష్ట్రంలో కొత్త ఎలక్ట్రికల్ వాహన విధానాన్ని ప్రభుత్వం నేటి నుంచి ప్రవేశపెట్టనుంది. కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి తెలంగాణ ప్రభుత్వం రాయితీలను ప్రకటించింది.
రాయితీలివే...
ఈ కొత్త పాలసీ ప్రకారం ఎలక్ట్రికల్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులో వంద శాతం రాయితీని కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే వంద శాతం రోడ్ ట్యాక్స్ ను కూడా మినహాయింపు ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ఈ కొత్త పాలసీని తీసుకు వచ్చినట్లు మంత్రి తెలిపారు. దీనివల్ల ఏడాదికి ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన వారికి లక్ష రూపాయలు మిగులుతాయని మంత్రి వివరించారు.
Next Story