Fri Jan 10 2025 09:22:53 GMT+0000 (Coordinated Universal Time)
పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు
పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్ష పీజు తేదీ గడువును పెంచుతూ విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది
పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్ష పీజు తేదీ గడువును పెంచుతూ విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం ఇంకొకసారి పొడిగించింది. వెయ్యి రూపాయల అపరాధ రుసుముతో కలిపి ఈ నెల 22వ తేదీ లోపు రెగ్యులర్/ప్రైవేటు విద్యార్థులు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇక పొడిగింపు ఉండదని...
ఇదే చివరిదని, ఇక మీదట ఫీజు గడువు పొడిగింపు ఉండదని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ఫీజు చెల్లించిన విద్యార్థుల జాబితాలను 24వ తేదీ లోపు ప్రధానోపాధ్యాయులు డీఈవో కార్యాలయాల్లో సమర్పించాలని, వాటిని 25వ తేదీ లోపు డీఈవోలు తమ కార్యాలయానికి పంపించాలని డైరెక్టర్ అన్ని విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేశారు.
Next Story