Mon Dec 23 2024 12:25:36 GMT+0000 (Coordinated Universal Time)
పైలట్ రోహిత్ రెడ్డికి భద్రత పెంపు
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ప్రభుత్వం భద్రత పెంచింది. ఈ మేరకు హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ప్రభుత్వం భద్రత పెంచింది. ఈ మేరకు హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రోహిత్ రెడ్డి 2+2 గా ఉంది. అయితే దీనిని 4 +4 కు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. భద్రత పెంపుతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ను కూడా రోహిత్ రెడ్డికి కేటాయించింది.
4 +4 గా...
మొయినాబాద్ ఫాంహౌస్ లో ఎమ్మెల్యే కొనుగోలుకు అంశంపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కీలకంగా ఉన్నారు. రోహిత్ రెడ్డితో నిందితులు ఫోన్ సంభాషణలు చేశారు. ఈ ఆడియో టేపులు కూడా బయటకు వచ్చాయి. దీంతో ఆయనకు భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Next Story