Mon Dec 23 2024 01:44:51 GMT+0000 (Coordinated Universal Time)
అర్థరాత్రి ఉత్తర్వులు.. ఎస్టీ రిజర్వేషన్లు జారీ
తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి పర్యటన నుంచి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమై దీనిపై చర్చించారు. అర్ధరాత్రి ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ఉత్తర్వులను విడుదల చేశారు. ఆరు నుంచి పది శాతానికి గిరిజనులు రిజర్వేషన్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగానే ఉత్తర్వులు వెలువడ్డాయి.
తక్షణమే అమలు...
2016 ఏప్రిల్ నెలలో బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాయి. గిరిజనులు మరింత నష్టపోకుండా రిజర్వేషన్ల శాతాన్ని మరింత పెంచుతున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విద్య, ఉపాధి అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు వెంటనే అమలులోకి రానున్నాయి. దీంతో గిరిజనులకు తెలంగాణలో విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు నిన్న అర్థరాత్రి నుంచి అమలులోకి వచ్చినట్లయింది.
Next Story