Mon Apr 21 2025 09:55:50 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త సచివాలయానికి నేటి నుంచే
నేటి నుంచి బీఆర్కే భవన్ నుంచి నూతన సచివాలయానికి కార్యాలయాలను తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

నేటి నుంచి బీఆర్కే భవన్ నుంచి నూతన సచివాలయానికి కార్యాలయాలను తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి తరలింపు ప్రక్రియ మొదలు పెట్టాలని సంబంధిత శాఖల కార్యదర్శులకు జీఏడీ అధికారులు ఆదేశాలు పంపారు. ఏ శాఖకు ఏ ఫ్లోర్లో కేటాయింపు చేసిందీ ముందుగానే వివరించడంతో నేటి నుంచే కొత్త సచివాలయానికి తమ కార్యాలయాలను తరలించనున్నారు.
వర్షం కురుస్తుండటంతో...
అయితే నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో కొంత తరలింపులో ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఇబ్బంది లేని శాఖలు మాత్రం తమ కార్యాలయాలను తరలించేందుకుద సిద్ధమయ్యాయి. బీఆర్కే భవన్ నుంచి తరలింపు తేదీ, సమయాన్ని స్పష్టం చేయడంతో ఫైళ్ల నుంచి అన్నీ తరలించే ప్రక్రియ నేడు ప్రారంభమైంది. ఈ నెల 30వ తేదీనకొత్త సచివాలయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ముందుగానే తరలించే ప్రక్రియను ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం కూడా నేటి నుంచే తరలింపు జరుగుతుందని అధికారులు తెలిపారు.
Next Story