Mon Dec 23 2024 14:47:00 GMT+0000 (Coordinated Universal Time)
నైట్ కర్ఫ్యూ విధించబోం.. హైకోర్టుకు ప్రభుత్వం స్పష్టీకరణ
నైట్ కర్ఫ్యూ విధించే పరిస్థితులు తెలంగాణలో లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా పై హైకోర్టులో విచారణ జరిగింది
నైట్ కర్ఫ్యూ విధించే పరిస్థితులు తెలంగాణలో లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇప్పటి వరకూ నిర్వహించిన ర్యాపిడ్ టెస్ట్ లు, ఆర్టీపీసీఆర్ టెస్ట్ ల వివరాలను హైకోర్టుకు అందజేసింది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతం మాత్రమే ఉందని, పది శాతం పాజిటివిటీ రేటు దాటితేనే నైట్ కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం తెలిపింది.
ఫీవర్ సర్వే.....
వారం రోజుల నుంచి రోజుకు లక్షకు పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఐదు రోజుల నుంచి తెలంగాణలో ఇంటింటికి తిరిగి పీవర్ సర్వే నిర్వహిస్తున్నామని, సర్వే ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. అయితే భౌతిక దూరం, మాస్క్ లు ధరించడం వంటి నిబంధనలను అమలు కావడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం తప్పుడు గణాంకాలు చూపిస్తుందని పిటీషనర్ వాదించారు. కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించంది.
Next Story