Sat Dec 21 2024 12:27:04 GMT+0000 (Coordinated Universal Time)
ఇంటర్ పరీక్షలు అప్పుడేనట
ఇంటర్మీడియట్ పరీక్షలను మే 5 వ తేదీన నిర్వహించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది
ఇంటర్మీడియట్ పరీక్షలను మే 5 వ తేదీన నిర్వహించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు తేదీలను ఖరారు చేసింది. రెండు మూడు రోజుల్లో ఈ తేదీలను ప్రకటించే అవకాశముంది. జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఉండటంతో ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 4వ తేదీ వరకూ నిర్వహిస్తున్నారు.
జేఈఈ మెయిన్స్.....
అయితే ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలు కావాల్సి ఉంది.16 రోజుల పాటు జరిగే ఈ పరీక్షలను మే 5వ తేదీ నుంచి ప్రారంభిస్తే ఎలా ఉంటుందన్న దానిపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. జేఈఈ మెయిన్స్ పరీక్షలకు విద్యార్థులు ఇబ్బంది పడకుండా కొత్త షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు భావిస్తున్నారు.
Next Story