Mon Dec 23 2024 04:46:20 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : తెలంగాణ కాంగ్రెస్ నేతలకు గుడ్ న్యూస్.. 35 మందికి పదవులు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ నేతలకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 35 మంది కాంగ్రెస్ నేతలకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ నాయకత్వం తీపి కబురు అందించింది. ఒకే సారి ముప్ఫయి ఐదు మందికి పదవులను ఇస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నప్పటికీ పదవులను భర్తీ చేయడం లేదన్న అసంతృప్తికాంగ్రెస్ నేతల్లో ఉంది.
35 మందిని నియమిస్తూ...
అయితే ఇటీవల కొన్ని రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకేసారి 35 మందికి పదవులు ఇచ్చింది. మైనారిటీ కార్పొరేషన్ ఛైర్మన్ గా జబ్బార్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ ఫఎడరేషన్ ఛైర్మన్ గా జంగా రాఘవరెడ్డిని, టీఎస్ ఐఐసీ ఛైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మలను, సంగీత నాటక అకాడమీ ఛైర్మన్ గా అలేఖ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story