Mon Dec 23 2024 11:24:40 GMT+0000 (Coordinated Universal Time)
Kaleswaram Project : కాళేశ్వరం ఒక తెల్ల ఏనుగు... తప్పుపట్టిన కాగ్ నివేదిక
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు పై కాగ్ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు పై కాగ్ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికలో గత ప్రభుత్వ విధానాలను కాగ్ తప్పబట్టింది. ప్రాజెక్టు వ్యయం 122 శాతం పెరిగిందని రిపోర్టులో పేర్కొన్నారు. కానీ ఆయకట్టు 52 శాతం మాత్రమే పెరిగిందని తెలిపింది. ప్రాజెక్టు డీపీఆర్‌కు ముందు రూ.25వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారని, ప్రాజెక్ట్ వ్యయం రూ.63వేల352 కోట్ల నుంచి రూ.లక్షా 2వేల 267 కోట్లు పెరిగిందని కాగ్ రిపోర్టు స్పష్టంచేసింది. ప్రాజెక్టుతో కలిగే ప్రయోజనాలను ఎక్కువ చేసి చూపించారని కూడా తెలిపింది. ఏటా విద్యుత్ చార్జీల కోసం రూ.10వేల 374 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపింది. అదనంగా నిర్వాహణ ఖర్చు రూ.272 కోట్లు అవుతుందని తెలిపింది.
అంచనా వ్యయం...
ప్రాజెక్టు నిర్వాహణ ఖర్చు ఏడాదికి రూ.10వేల 647 కోట్లు రూపాయలుగా ఉందని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.81,911 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ అంచనాలన్నిటికీ కలిపి ప్రభుత్వం ఓకేసారి అనుమతి ఇవ్వలేదని తెలిపింది. విడతల వారీగా ఒక్కో పనికీ విడివిడిగా అనుమతులు జారీ చేశారని పేర్కొంది. 2022 మార్చి నాటికి మొత్తం రూ.లక్షా 10వేల 248 కోట్లు అనుమతులు ఇచ్చారని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నిధులను ఎలా సమకూర్చుకున్నారో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవని కాగ్ స్పష్టం చేసింది. ప్రాజెక్ట్ నిధులు సమకూర్చుకోవడం కోసం కేఐసీసీఎల్ ను ఏర్పాటు చేశారని, ప్రభుత్వం ఇచ్చిన హామీలతో దీని ద్వారా రూ.87,449 కోట్ల రుణాలను సమీకరించారని తెలిపింది.
రుణాలపై వడ్డీ...
కేఐసీసీఎల్ రుణాలపై ఏటా 7.8 శాతం నుండి 10.9 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుందని కాగ్ తెలిపింది. కొమరవెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదించిన ప్రదేశం అనుకూలంగా లేదని కూడా చెప్పింది. ప్రాజెక్ట్ నిర్మించే ప్రదేశంలో డీప్ సీటెడ్ వెర్డికల్ ఫాల్ట్ ఉందని ఎన్జీఆర్ఐ ఆధ్యయంలో పేర్కోందని కాగ్ తన రిపోర్టులో చెప్పింది. భూకంపాలపై లోతైన అధ్యయానాలేవి నిర్వహించకుండానే మల్లన్న సాగర్ నిర్మించారని, 50టీఎంసీల సామర్ధ్యంతో రూ.6వేల126 కోట్లతో మల్లన్న సాగర్ నిర్మించారని కాగ్ అక్షింతలు వేసింది. అంతరాష్ట్ర సమస్యలు..నిల్వ సామర్థ్యంపై సరైన అధ్యయనం చేయలేదని కూడా తెలిపింది.
బడ్జెట్ పై ప్రభావం...
కాళేశ్వరం డీటయిల్డ్ ప్రాజక్టు రిపోర్టు తయారు చేసిన వ్యాప్కోస్ పని తీరులో లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది. కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ ప్రయోజనాల్లో అదనపు పెరుగుదల లేదు కాగ్ స్పష్టం చేసింది. విద్యుత్ వినియోగానికి ఏటా రూ.3,555 అదనపు వ్యయం పెరిగిందని, రీ ఇంజినీరింగ్, మార్పుల వల్ల అప్పటికే చేసిన కొన్ని పనులు ఉపయోగం లేకుండా పోయాయని, రీ ఇంజినీరింగ్, మార్పుల వల్ల రూ.765 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ రిపోర్టులో తెలిపింది. పనుల అప్పగింతలో నీటిపారుదల శాఖ తొందరపాటు ప్రదర్శించిందని కూడా అభిప్రాయపడింది. డీపీఆర్ ఆమోదానికి ముందే రూ.25వేల కోట్ల విలువైన పదిహేడు పనులు అప్పగించారని కూడా చెప్పింది. కాళేశ్వరంపై ఆదాయం లేదు కాబట్టి రుణాలు చెల్లింపు కష్టమవతందన్న కాగ్ కాళేశ్వరం ప్రభావం బడ్జెట్ పై పడుతుందని చెప్పింది.
Next Story