Fri Nov 22 2024 16:06:03 GMT+0000 (Coordinated Universal Time)
Anganwadi : అంగన్వాడీలతో చర్చలు విఫలం.. సమ్మె కొనసాగిస్తామని హెచ్చరిక
అంగన్వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమ్మెను కొనసాగిస్తున్నట్లు ప్రకటించాయి
అంగన్వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అంగన్వాడీ వర్కర్లు తమ డిమాండ్ల సాధన కోసం గత పదహారు రోజుల నుంచి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం చర్చలకు పిలిచింది. మంత్రి వర్గ ఉపసంఘంతో అంగన్వాడీ సంఘాల నేతలు చర్చించారు. అయితే జీతాలు పెంచేందుకు మాత్రం ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో చర్చలు విఫలమయ్యాయి. తాము సమ్మె విరమించే ప్రసక్తి లేదని అంగన్వాడీ కార్యకర్తలు తేల్చి చెప్పారు. సమ్మె కొనసాగిస్తామని పేర్కొన్నారు.
డిమాండ్లను పరిష్కరించినా...
అయితే ప్రభుత్వం మాత్రం చాలా డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికే పరిష్కరించిందని, ఉత్తర్వులు కూడా జారీ చేసిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సంక్రాంతి పండగ తర్వాత తిరిగి చర్చిస్తామని, అప్పటి వరకూ సమ్మెను విరమించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అంగన్వాడీ నేతలను కోరారు. అయితే తాము సమ్మె విరమించేది లేదని వారు తేల్చి చెప్పడంతో అనివార్యంగా మారింది. ఎమ్మెల్యే ఇళ్ల ముట్టడితో పాటు వచ్చే నెల 3వ తేదీన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం యధాతధగా జరుగుతుందని వారు చెప్పారు.
Next Story