Mon Dec 23 2024 07:20:00 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ప్రమాణ స్వీకారం.. వెంటనే తొలి కేబినెట్
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మంత్రులకు శాఖలను కేటాయించారు. ఆ తర్వాత తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. వెనువెంటనే రేవంత్ రెడ్డి మంత్రులకు శాఖలను కేటాయించారు. ఆ తర్వాత తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి చేరుకోవడంతో ఆయనకు సచివాలయ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు.
తొలి సమావేశంలో...
ఇప్పటికే ఆరు గ్యారంటీలపై రేవంత్ రెడ్డి సంతకం చేశారు. అయితే దీనికి కేబినెట్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. మ్యానిఫేస్టోలో కాంగ్రెస్ చెప్పిన హామీలపై కూడా తొలి కేబినెట్ లో చర్చించే అవకాశముంది. మంత్రులందరూ సచివాలయానికి రావాలని, కేబినెట్ సమావేశం జరుగుతుందని సమాచారం రావడంతో వెంటనే వారు బయలుదేరి సచివాలయానికి చేరుకుంటున్నారు. తొలి కేబినెట్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story