Mon Dec 23 2024 07:45:46 GMT+0000 (Coordinated Universal Time)
రైతులకు సంక్రాంతి కానుక
తెలంగాణలో రైతులకు ప్రభుత్వం నేటి నుంచి రైతు బంధు నిధులను విడుదల చేయనుంది.
తెలంగాణలో రైతులకు ప్రభుత్వం నేటి నుంచి రైతు బంధు నిధులను విడుదల చేయనుంది. యాసంగి సీజన్ లో పెట్టుబడి సాయం కింద రైతులు ఈ నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రైతుకు ఉన్న ఎకరాలను బట్టి దశలవారీగా వారి అకౌంట్లలో ప్రభుత్వం నిధులను జమ చేయాలని నిర్ణయించింది. సంక్రాంతి సందర్భంగా రైతులకు ఈ కానుకను ప్రభుత్వం అందచేయాలని నిశ్చయించింది.
నేటి నుంచి నిధులు విడుదల....
రైతు బంధు పథకం ఈ సీజన్ లో మొత్తం 70.54 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు. ఇందుకోసం 7,676 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం సిద్ధం చేసింది. సంక్రాంతి పండగలోపు రైతులందరికీ పెట్టుబడి సాయాన్ని అందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈరోజు నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ కానున్నాయి. ఎలాంటి కోతలు లేకుండా జమ చేయాలని కేసీఆర్ ఆదేశించారు.
Next Story