Tue Dec 24 2024 13:33:29 GMT+0000 (Coordinated Universal Time)
గవర్నర్ సంతకం చేశారు
తెలంగాణ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు. బడ్జెట్ ఫైల్స్ పై గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సంతకాలు చేశారు.
తెలంగాణ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు. బడ్జెట్ ఫైల్స్ పై గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సంతకాలు చేశారు. దీంతో తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు మార్గం సుగమమయింది. వచ్చే నెల 3వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
3 నుంచే సమావేశాలు...
ఈ నెల 3న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారు. అనంతరం రెండు రోజుల విరామం అనంతరం వచ్చే నెల 6వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశముందని చెబుతున్నారు. ఈసారి ఎన్నికల సంవత్సరం కావడంతో మూడు లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశముంది.
Next Story