Tue Dec 24 2024 02:36:57 GMT+0000 (Coordinated Universal Time)
Governor : రాచరికం నుంచి తెలంగాణ విముక్తి పొందింది : గవర్నర్
తెలంగాణలో నూతనంగా ఎన్నికైన ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో నూతనంగా ఎన్నికైన ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ శుభాకాంక్షలు తెలిపారు. అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు నిచ్చారన్నారు. కాళోజీ కవితతో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రజావాణి కార్యక్రమంతో కొత్త ప్రభుత్వం పాలన ప్రారంభమయిందని గవర్నర్ అన్నారు. ప్రజలందరికీ సమావ అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. మీ ప్రయాణం ప్రజాసేవకే అంకితం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. రైతులు, యువత, మహిళలకు ఈ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. అలాగే ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని పది లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుందన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు.
అడ్డుగోడలు తొలిగి...
రాచరికం నుంచి తెలంగాణ విముక్తి పొందిందని తెలిపారు. దేశానికే తెలంగాణ పాలన ఆదర్శం కావాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ ప్రభుత్వం ఆవిర్భావంతో తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటుందని అన్నారు. నిర్భంధ పాలన నుంచి ప్రజలు విముక్తిని కోరుకున్నారని గవర్నర్ అన్నారు. పాలకులు, ప్రజల మధ్య ఇనుప కంచెలు తొలగిపోయాయని గవర్నర్ అన్నారు. పౌర హక్కులు, ప్రజా హక్కులకు నాంది పలికిందన్నారు. పాలకులు ప్రజాసేవకులే కాని పెత్తందార్లు కాదని గవర్నర్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలుపర్చేలా ముందుకు సాగుతుందన్నారు. అడ్డగోడలు, అద్దాల మేడలు పటాపంచాలయిపోయాయని అన్నారు. ప్రభుత్వం ప్రజారంజకమైన పాలన అందిస్తుందని తెలిపారు.
Next Story