Thu Dec 19 2024 02:56:13 GMT+0000 (Coordinated Universal Time)
Medigadda : మేడిగడ్డకు రేవంత్ రెడ్డి బృందం
మేడిగడ్డ బ్యారేజీని మంత్రులు, ఎమ్మెల్యేల బృందం సందర్శించింది
మేడిగడ్డ బ్యారేజీని మంత్రులు, ఎమ్మెల్యేల బృందం సందర్శించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు, కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యేలు బస్సులో బయలుదేరి మేడిగడ్డకు చేరుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులో దెబ్బతిన్న ప్రాంతాన్ని వారు పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేుజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్ లోని పియర్స్ ను వారు పరిశీలించారు. అధికారులు వారికి దగ్గరుండి వివరించారు.
ఉన్నతాధికారులు వారికి...
హైదరాబాద్ నుంచి పది గంటలకు బయలుదేరిన ప్రజాప్రతినిధుల బృందం మేడిగడ్డకు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చేరుకుంది. మరికాసేపట్లో వారికి మేడిగడ్డ బ్యారేజీ గురించి నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం బయలుదేరి ప్రజాప్రతినిధుల బృందం హైదరాబాద్ కు చేరుకుంటుంది. భోజనానికి జనగామలో రాత్రికి కాసేపు ఆగుతారు.
Next Story