Mon Dec 23 2024 03:30:13 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేటి నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు
గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలు నేటి నుంచి తెలంగాణలో ప్రారంభం కానున్నాయి
గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలు నేటి నుంచి తెలంగాణలో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకూ గ్రూప్ వన్ పరీక్షలు జరగనున్నాయి. టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.రాష్ట్రంలోని మొత్తం మూడు జిల్లాల్లో 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కానుండటంతో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసు పహారా మధ్య గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమయింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకూ పరీక్ష జరగనున్నాయి.
ఆందోళనకు దిగుతారని...
మరో వైపు గ్రూపు వన్ అభ్యర్థులు కొందరు ఆందోళనకు దిగుతారన్న సమారంతో పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించారు. భారీగా పోలీసులను మొహరించారు. హాల్ టిక్కెట్ ఉన్న వారిని మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నార. మెయిన్స్ కు రాష్ట్ర వ్యాప్తంగా 31 వేల మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. అభ్యర్థులు తప్ప మరెవ్వరికీ ఆ పరిసర ప్రాంతాల్లోకి ప్రవేశించకూడదు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టంచేశారు. పరీక్షల నిర్వహణపై ఉన్నతస్థాయి పోలీసు అధికారులు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.
Next Story