Mon Dec 23 2024 14:18:26 GMT+0000 (Coordinated Universal Time)
వైద్యుల సమక్షంలో.. హాస్పిటల్ బెడ్ పైనే పెళ్లి(VIDEO)
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కు చెందిన బానోథ్ శైలజ కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బస్వరాజు పల్లె గ్రామానికి..
ప్రేమించిన వారిని మోసం చేసి మరొకరిని పెళ్లాడటం, ప్రియుల కోసం కట్టుకున్నవారినే కడతేర్చుతున్న ఈ కాలంలో.. ఓ ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమైంది. పెండ్లి పీటలపై, పచ్చని తోరణాలతో అలంకరించిన పెళ్లిమంటపంలో జరగాల్సిన పెళ్లి ఆస్పత్రిలో జరిగింది. ఈ ఘటన మంచిర్యాలలో జరిగింది. పెండ్లి మండపం లేదు.. భాజా భజంత్రీలు లేవు. కుటుంబ సభ్యులు, బంధు, మిత్రుల సందడి అంతకన్నా లేదు. అనుకున్న ముహూర్తానికి యువతి మెడలో మూడు ముళ్లు వేశాడు వరుడు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కు చెందిన బానోథ్ శైలజ కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బస్వరాజు పల్లె గ్రామానికి చెందిన హట్కార్ తిరుపతి కి వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరి 23, గురువారం రోజున లంబాడిపల్లిలో పెళ్లి జరగవలసి ఉంది. కానీ.. వధువు శైలజ ఉన్నట్టుంది అస్వస్థతకు గురైంది. దాంతో కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు ఆమెను పరిశీలించి, పరీక్షలు చేసి శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆమెకు కొన్నాళ్లు బెడ్ రెస్ట్ అవసరమని తెలిపారు వైద్యులు. విషయం పెండ్లి కుమారుడు తిరుపతి కి తెలియడంతో కంగారుపడ్డాడు.
ఇరు కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలే. పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు పెళ్లి ఆగిపోతే మళ్లీ పెళ్లిచేసుకునేందుకు ఖర్చు ఎక్కువ అవుతుందని ఆలోచించాడు. ఎలాగైనా గురువారం పెద్దలు నిర్ణయించిన ముహూర్తం కు పెండ్లి చేసుకోవాలనే పట్టుదలతో ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించాడు. శైలజ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వచ్చి వైద్యుల కు విషయం చెప్పారు. వరుడి మంచి మనసును అర్థం చేసుకున్న వైద్యులు పెండ్లికి ఒప్పుకున్నారు. వైద్యులే పెండ్లి పెద్దలుగా మారారు. బెడ్ పై ఉన్న శైలజకు తిరుపతి మాంగళ్యధారణ చేసాడు.ఇద్దరు పూల దండలు మార్చుకుని దంపతులుగా మారారు. వధువు కుటుంబ సభ్యులు, వరుడు కోరిన మీదట పెండ్లికి అనుమతి ఇచ్చామని వైద్యుడు ఫణికుమార్ తెలిపారు.
Next Story